రాజమౌళి డ్రీమ్ ను కన్నడంలో తీసేశారు..!!

రాజమౌళి డ్రీమ్ ను కన్నడంలో తీసేశారు..!!

రాజమౌళికి ఓ డ్రీం ఉన్నది.  పెద్ద ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీని తరువాత సెకండ్ రిలీజ్ చేసినా కోటి రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది.  వెండితెరపై మరలా అలాంటి సినిమా రాలేదు.  జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి ఆ సినిమాను రీమేక్ చేద్దామని అనుకున్నా.. అవి మాటలుగానే మిగిలిపోయాయి.  వివి వినాయక్ సైతం ఆ సినిమాను తీద్దామని అనుకున్నారు.  

ఇలా వీరంతా అనుకుంటుండగానే.. కన్నడంలో నాగన్న అనే దర్శకుడు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.  కన్నడలో కురుక్షేత్ర పేరుతో తెరకెక్కుతోంది.  దర్శన్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు.  జేకే భారవి కధారచయిత.  ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది.  త్వరలోనే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.  ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ మూవీని రూ. 150 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.