రజిని 168లో సీనియర్ హీరోయిన్... 

రజిని 168లో సీనియర్ హీరోయిన్... 

రజినీకాంత్ దర్బార్ సినిమా ముగించేశారు.  ఇక సినిమా రిలీజ్ కావడమే ఆలస్యం.  మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి.  వచ్చే ఏడాది జనవరి 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను నిన్నటి రోజున రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే.  

కాగా, ఈ సినిమా తరువాత రజినీకాంత్ దర్శకుడు శివతో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రారంభం కాబోతున్నది.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ అనుకున్నారు.  అయితే, ఇందులో ఓ సీనియర్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.  కాలా, పేట సినిమాల్లో సీనియర్లను తీసుకున్నట్టుగానే ఈ సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని అనుకున్నారట.  దానికిసం కుష్బూను అడిగారని, ఆమెకు రజినితో కలిసి నటించేందుకు ఒకే చేశారని తెలుస్తోంది. గతంలో రజినీతో కలిసి అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్ సినిమాల్లో నటించింది కుష్బూ.