శ్రీదేవి కూతురికి ఎంత ఓపికంటే...

శ్రీదేవి కూతురికి ఎంత ఓపికంటే...

అలనాటి అందాల తార శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.  పెద్దమ్మాయి జాన్వీ కపూర్ ఇప్పటికే సినిమాల్లోకి వచ్చింది.  ఆమె చేసిన మొదటి సినిమా ధఢక్ సూపర్ హిట్ కావడమే కాకుండా, ఏకంగా రూ.100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.  ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో బోలెడు సినిమాలున్నాయి.  వీటితో ఫుల్ బిజీగా ఉన్నది జాన్వీ.  

ఇక రెండో అమ్మాయి ఖుషి కపూర్.  త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నది.  ఫస్ట్ సినిమా గురించి ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉంటె, అన్న అర్జున్ కపూర్ హీరోగా చేసిన మోస్ట్ వాంటెడ్ సినిమాను చూసేందుకు గురువారం సాయంత్రం ఓ థియేటర్కు వెళ్ళింది.  ఆమెను చూడగానే శ్రీదేవి అభిమానులు సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు.  ఖుషి చాలా ఓపికగా అందరికి సెల్ఫీ దిగే అవకాశం ఇచ్చింది.  ఖుషి ఓపికకు నెటిజన్లు ఫిదా అయ్యారు.  స్టార్ హీరోయిన్ అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఖుషిలో ఉన్నాయని కితాబిస్తున్నారు.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#khushikapoor for her brothers film screening @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on