ఒక్క పాజిటివ్ కేసు... ఐపీఎల్ పని అంతే : వాడియా 

ఒక్క పాజిటివ్ కేసు... ఐపీఎల్ పని అంతే : వాడియా 

కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - దుబాయ్, అబుదాబి, షార్జాలోని మొత్తం 3 వేదికలలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరుగుతుందని ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించాలా వద్ద అనే నిర్ణయం యూఏఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అలాగే ఆటగాళ్లు అందరూ ఒక నెల ముందే అక్కడికి చేరుకోనున్నారు. అయితే నెల రోజుల ముందే యూఏఈకి చేరుకోనున్న క్రికెటర్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది ఒకవేళ అనుమతిస్తే వారి కుటుంబ సభ్యులు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత లీగ్ ముగిసేంతవరకు బయో సెక్యూర్ బబుల్‌లో ఉండాల్సిందే. ఈ బబుల్ లోకి ఒకసారి ఎవరైనా అడుగుపెడితే ఐపీఎల్ పూర్తయేంతవరకు బయటి  వ్యక్తులని కలవకూడదు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఐపీఎల్ సమయంలో ఒక్క కరోనా పాజిటివ్ వస్తే..? లీగ్ పని అంతే, మొత్తం దెబ్బ తింటుందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ- యజమాని నెస్ వాడియా అభిప్రాయపడ్డాడు. ఇంత పెద్ద సమస్యను వదిలేసి బీసీసీఐ ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్ గురించి చర్చ జరగడం హాస్యాస్పదంగా ఉందని వాడియా చెప్పుకొచ్చాడు. మరి చూడాలి ఒకవేళ వాడియా చెప్పిన మాట.. నిజం అవువుతుందా... అనేది.