ఎంబాపె అరుదైన రికార్డు

ఎంబాపె అరుదైన రికార్డు

ఫ్రాన్స్‌ యువ ఆటగాడు కైలిన్‌ ఎంబాపె అరుదైన రికార్డును సొం‍తం చేసుకున్నాడు. ఆదివారం క్రోయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ లో ఎంబాపె 65వ  నిమిషంలో గోల్‌ సాధించాడు. దీంతో బ్రెజిల్‌ దిగ్గజ ఆటగాడు పీలే తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్‌ కప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.  అంతకుముందు పీలే 18 ఏళ్ల వయసులో 1958లో బ్రెజిల్‌-స్వీడన్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో గోల్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 5-2 గోల్ తేడాతో కప్పు సొంత చేసుకుంది.

మ్యాచ్‌ అనంతరం 'మైలవ్‌' అనే క్యాప్షన్‌తో ట్రోఫీని ముద్దాడుతూ ఫోజిచ్చిన ఫొటోను కైలిన్‌ ఎంబాపె ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు పీలే స్పందించాడు. 'కైలిన్‌ నా రికార్డును సమం చేశాడు. ఇక నా బూట్లకు ఉన్న దుమ్ము దులపాల్సిందే' అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.