ఎంఎస్కే ప్రసాద్ స్థానంలో.. కొత్త చీఫ్ సెలెక్టర్..

ఎంఎస్కే ప్రసాద్ స్థానంలో.. కొత్త చీఫ్ సెలెక్టర్..

బీసీసీసీ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఎల్. శివరామకృష్ణన్ పేరు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పదవీకాలం ముగిసన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) డిసెంబర్ 1వ తేదీన జరగనుంది. దీంతో.. నియామకాలపై బలమైన ఊహాగాలు ఉన్నాయి.. సెలక్షన్ కమిటీ, సెలెక్టర్లను నియమించే క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురించి కూడా చర్చ సాగుతోంది. ఇక, వీటిలో ముఖ్యంగా భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్... బీసీసీఐ హెడ్ సెలెక్టర్‌ కాబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుత హెడ్ సెలెక్టర్‌గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ పదవీకాలం ముగియడంతో.. శివరామకృష్ణన్‌కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. 

ఇక సౌత్ జోన్‌ నుంచి హైదరాబాద్, కర్ణాటకకు చెందిన అర్షద్ అయూబ్, వెంకటేష్ ప్రసాద్ పేర్లు, సెంట్రల్ జోన్ నుంచి జ్ఞానేంద్ర పాండే, గగన్‌ ఖోడా పేర్లు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తుండగా.. ఇతర మండలాల నుండి ఎవరీ పేర్లు ఖరారు చేయలేదు. అయితే నార్త్ నుంచి ఆశిష్ నెహ్రా, ఈస్ట్ నుంచి దీప్ దాస్‌గుప్తా, రోహన్ గవాస్కర్, వెస్ట్ జోన్ నుండి జతిన్ పరంజే, అజిత్ అగార్కర్ పేర్లపై చర్చించినట్టుగా తెలుస్తోంది.