వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లాకు చెందిన నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఇవాళ ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. లబ్బి లోటస్‌పాండ్‌కు వచ్చినట్లు తెలుసుకున్న జగన్.. స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు.! అనంతరం కాసేపు తాజా రాజకీయ పరిణామాలను చర్చించన జగన్.. వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెంకటస్వామితోపాటు గురు రాఘవేంద్ర బ్యాంకు కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు దస్తగిరి రెడ్డి కూడ వైసీపీలో చేరారు. నందికొట్కూరు నుంచి లబ్బి వెంకటస్వామి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరిన ఆయన.. ఇప్పుడు వైసీపీ గూటికి చేరారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, తనకు జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని  వెంకటస్వామి చెప్పారు.