మజిలీ విషయంలో ఎందుకలా చేస్తున్నారు..?

మజిలీ విషయంలో ఎందుకలా చేస్తున్నారు..?

నాగచైతన్య.. సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం.. సాంగ్స్ కూడా బాగుండటంతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే అంచనాకు వచ్చారు.  మొన్నటి వరకు హీరో హీరోయిన్లు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.  కొన్ని రోజులుగా అలాంటి ప్రమోషన్స్ ఆగిపోయాయి.  

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ విషయంలో ఎందుకని స్పీడ్ పెంచలేదు అర్ధం కావడం లేదు.  సినిమా బాగుంది అంటే ఏ క్లాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్లు వస్తాయి.  మరి బి, సిక్లాస్ సెంటర్ల పరిస్థితి ఏంటి.  సినిమాకు ఈ రెండు సెంటర్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ముఖ్యం.  కాబట్టి ఇప్పటికైనా యూనిట్ ప్రమోషన్స్ ను చేస్తే బాగుంటుంది.