మొగుడు, పిల్లలని వదిలేసి హైదరాబాద్ చేరిన ఢిల్లీ మహిళ

మొగుడు, పిల్లలని వదిలేసి హైదరాబాద్ చేరిన ఢిల్లీ మహిళ

టిక్ టాక్ ప్రేమ ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీకి రప్పించింది. భర్త ,పిల్లల ను విడిచి వారం రోజులు యువ బ్యాచ్ తో జత కట్టి ఉండిపోయింది..ఆమె టిక్ టాక్ ఐడి తో ఆమె ఫాలో వార్స్ చుట్టూ తిరిగిన భర్త, చివరికి బేగంపేట ప్రకాష్ నగర్ లో ఆమె ఆచూకీ కనుగొన్నాడు. వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన ఓ ఉద్యోగి భార్య,ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీలోని ఓ ఆర్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. పని ఒత్తిడి తో భార్య ను కాస్త పట్టించుకోక పోవడంతో ఆమె టిక్ టాక్ యాప్ కు బానిసగా మారిపోయింది.

ఈ తరుణం లో బేగంపేట ప్రకాష్ నగర్ కు చెందిన ఓ యువకుల బ్యాచ్ తో పరిచయం ఏర్పడింది. ఆమె తన సంసార కష్టాలు చెప్పుకోగా తమ వద్దకు రమ్మంటూ ఆహ్వానం పలికారు ఆ యువకులు. వస్తుందా ? లేక టైమ్ పాస్ చేసిందా ? అనుకునే లోపే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ చేరింది ఆ మహిళ. ఈ క్రమంలో ఏమి చేయాలో అర్థం కాని ఆ బ్యాచ్ ఆమెను ఓ ఫ్రెండ్ రూమ్ లో ఉంచారు. వారం రోజులుగా ఆమె ఇంటికి చేరక పోవడంతో భర్త ఆమె టిక్ టాక్ పరిచాయస్థూల చుట్టూ తిరిగాడు. చివరికి వీరితో కూడా ఆ మహిళకి బాగా పరిచయం ఉండడంతో వారి ఆచూకీ తెలుసుకొని ప్రకాష్ నగర్ చేరుకున్నాడు.

అతని రాక చూసి షాక్ తిన్న బ్యాచ్ ఏమి చెప్పాలో తెలియక ఆ మహిళ దగ్గరకు తీసుకెళ్ళారు. ఇన్ని రోజులుగా ఒక మహిళ ఆ రూమ్ లో ఉంటుందన్న విషయం తెలుసుకున్న కాలనీ వాసులు యువకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ పెద్దడవడంతో బేగంపేట పోలీస్ లకు సమాచారం అందించారు. ఐతే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు భార్య ను కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి భర్త తో ఢిల్లీ సాగనంపారు. ఐతే ఇన్ని రోజులుగా మహిళను రూమ్ లో ఉంచినా కనీసం విషయం  తెలుసుకోనందుకు ఇంటి యజమాని తో పాటు యువకుల్ తల్లి దండ్రుల పిలిచి మందలించారు పోలీసులు.