టాలీవుడ్లో మరో విషాదం.. దర్శకురాలు బి.జయ కన్నుమూత

టాలీవుడ్లో మరో విషాదం.. దర్శకురాలు బి.జయ కన్నుమూత

హరికృష్ణ మరణించి మూడు రోజులు కాకముందు టాలీవుడ్లో మరో విషాదం జరిగింది.  తెలుగు సినీ దర్శకురాలు బి జయ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.  పాత్రికేయురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జయ, సినిమాపై ఉన్న మక్కువతో దర్శకత్వం వైపు అడుగు వేశారు.  2003 వ సంవత్సరంలో జయ తొలిసారి  చంటిగాడు అనే సినిమాకు దర్శకత్వం వహించారు.  అనంతరం ప్రేమికుడు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకురాలిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.  2017 వ సంవత్సరంలో వైశాఖం అనే సినిమా రిలీజ్ అయింది.  అదే ఆమె ఆఖరి సినిమా.  దర్శకత్వంతో పాటు ఆమె ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.  తన సినిమాలకు ఆమె స్వయంగా ఎడిటింగ్ చేసుకునేవారు.  జయ భర్త బిఏ రాజు సినిమా ఇండస్ట్రీలో పిఆర్ గా పనిచేస్తున్నారు.  దర్శకురాలు బి జయ మరణంపట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తన సంతాపాన్ని తెలియజేసింది.