కారు, సైకిల్ దే గెలుపుః లగడపాటి 

 కారు, సైకిల్ దే గెలుపుః లగడపాటి 

ఆంధ్రప్రదేశ్ లో తిరిగి తెలుగుదేశం గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. తెలంగాణలో కారు హవా కొనసాగుతుందని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో ఏ కూటమికి ఆధిక్యం రాదన్నారు. తెలంగాణలో చేసిన సర్వే లెక్కతప్పినందునా ఈ సారి మరింత జాగ్రత్తగా నిర్వహించామని తెలిపారు. సర్వే వివరాలు రేపు తిరుపతిలో వివరిస్తానన్నారు. ఇది కేవలం నా అంచనా మాత్రమే అని లగడపాటి తెలిపారు.