ఎన్నికల్లో పోటీపై లగడపాటి క్లారిటీ..

ఎన్నికల్లో పోటీపై లగడపాటి క్లారిటీ..

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. నరసరావుపేట నుంచి టీడీపీ తరఫున తాను పోటీ చేస్తాననేది అవాస్తవం అన్నారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ అనుచరులు, సహచరుల నుంచి ఎన్నికల్లో పోటీకి ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. తాను రాజకీయాలకు వ్యతిరేకం కాదని.. పోటీ చేయకూడదనేది తన వ్యక్తిగత నిర్ణయమని లగడపాటి వివరించారు. అన్ని పార్టీల నేతలతో తనకు సత్సబంధాలున్నాయని.. ఐతే.. ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఎవరితోనూ చర్చించలేదని అన్నారు.