లగడపాటి సర్వే ఫలితాలు.. రిలీజ్ డేట్ ఫిక్స్

లగడపాటి సర్వే ఫలితాలు.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్నికలు అనగానే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే కోసం రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎన్నికల ఫలితాలను తన సర్వేలతో సరిగ్గా అంచనా వేయడంలో లగడిపాటి దిట్ట. గతంలో చాలా సందర్భాల్లో లగడపాటి చెప్పింది చెప్పినట్టుగానే ఫలితాలొచ్చాయ్‌. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగియడంతో ఆయన సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఆయన తన సర్వే ఫలితాలను విడుదల చేస్తారోనన్న ఉత్కంఠ పెరగింది. ఐతే.. మే 19వ తేదీ తర్వాత సర్వే వివరాలు ప్రకటిస్తానని లగడపాటి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున ఫలితాలపై తాను చేసిన సర్వ ఫలితాలను విడుదల చేయలేనని అన్నారు.