'కూటమి పేరుతో కుట్రలు..'

'కూటమి పేరుతో కుట్రలు..'

మహా కూటమి మహా ఓటమి ఖాయమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ 'తెలంగాణ ద్రోహుల పార్టీతో కోదండరాం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చంద్రబాబు కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనలను ఉత్తమ్.. బాబుకి తాకట్టు పెట్టారు' అని విమర్శించారు. ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ తన స్థాయికి మించి మాట్లాడుతున్నరని.. మజ్లిస్‌ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  అమిత్ షా, మోడీ ప్రచారం తర్వాత రాజకీయ ముఖ చిత్రం మారుతుందన్న ఆయన.. కాంగ్రెస్ జబితా ప్రకటన తర్వాత బీజేపీలో పలువురు నేతలు చేరుతారని చెప్పారు.

యువ తెలంగాణ పార్టీతో..
ఎన్నికల్లో యువతెలంగాణ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తామని చెప్పిందని లక్ష్మణ్‌ తెలిపారు.  చాలా వర్గాలు బీజేపీతో కలిసి పనిచేస్తామని సంప్రదిస్తున్నాయన్నారు.