వాజ్ పేయిది తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధం

వాజ్ పేయిది తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధం

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అజాత శత్రువు అని కొనియాడారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్. ఆయన ఇకలేరు అనే వార్తను జీర్ణించుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిగా, ప్రతిపక్ష నేతగా ఆయన దేశానికి సేవలందించారని తెలిపారు. ప్రధానిగా పోక్రాన్ అణు పరీక్ష, గ్రామీణ సడక్ యోజన లాంటీ ఎన్నో కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్ లో ఆయన బాగ్దాటికి ప్రతిపక్ష నేతలు సైతం  మంత్ర ముగ్ధులు అయ్యేవారని తెలిపారు లక్ష్మణ్. పి.వి.నరసింహరావు సైతం  వాజపేయిని గురువుగా భావించారని పేర్కొన్నారు. జై జవాన్, జై కిసాన్ కి ..... జై విజ్ఞాన్ ని జోడించిన వ్యక్తి వాజ్ పేయి అని చెప్పారు. ఒక్క ఓటుతో ఒడిపోతానని తెలిసి నిజాయితీగా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అద్వానీ, వాజ్ పేయి రామ లక్ష్మణుల్లాంటి వారని తెలిపారు. వాజ్ పేయికి ఏపీ, హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.