డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు..

డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు..

తనపై జరుగుతోన్న అసత్య ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి... హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన ఆమె.. సోషల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గౌరప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను అగౌర పరుస్తూ విమర్శలు చేస్తున్నారని.. ఏప్రిల్ 4వ తేదీన కోటి తప్పుడు ఆరోపణలు చేస్తూ టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో నా వ్యక్తిత్వాన్ని కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి అనే యువకుడు పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నా పై ఆరోపణలు చేస్తున్న కోటి అనే వ్యక్తిని బిడ్డలాగా భావించానన్నారు. నా పరువు, మర్యాదలు కాపాడాలని డీజీపీని కోరా.. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాలి విజ్ఞప్తి చేశానన్న ఆమె.. డీజీపీ వెంటనే స్పందించి హైదరాబాద్‌ కమిషనర్కు చెప్పారని.. హైదరాబాద్‌ సీపీకి కలుస్తానని తెలిపారు. కాగా, లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోంది అంటూ కోటి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఆ తర్వాత లక్ష్మీపార్వతి నుంచి నాకు ప్రాణహాని ఉందని ఆరోపించాడు కోటి.