మా ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడు : లక్ష్మీ పార్వతి

మా ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడు : లక్ష్మీ పార్వతి

నేడు దివంగత సీఎం ఎన్టీఆర్‌ 25 వ వర్ధంతి.  ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి బాలకృష్ణ, లక్ష్మీ పార్వతి  నివాళ్ళు అర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్టాడారు.  ఈ రోజు ఇప్పటికి తెలుగు వాళ్ళ గుండెల్లో మరిచిపోలేని నాయకుడు ఎన్టీఆర్..ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.  ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి పరిపాలన కొనసాగుతుందని..రామరాజ్యం నడుస్తుందని పేర్కొన్నారు.  మా ఇంట్లో చిన్న ఎన్టీఆర్ పుట్టాడని.. ఆయన ఆశయ స్పూర్తితో నా భర్త ఆశీస్సులు ఆ బిడ్డ పై ఉండాలని తెలిపారు.  ఆయన సుపరిపాలన అందరికి ఆదర్శం కావాలన్నారు. 25 సంవత్సరాలు నుండి దగా కోరు రాజకీయాలు నడిచాయో ఈ రోజు కూడా అవే నడుస్తున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వసం పై పోలీసులు పని చేసుకుపోతున్నారని.. జగన్మోహన్ రెడ్డి పరిపాలనే శ్రీరామ రక్ష అని పొగిడారు లక్ష్మీ పార్వతి.