లోకేష్‌కి లక్ష్మీపార్వతి వార్నింగ్‌..!

లోకేష్‌కి లక్ష్మీపార్వతి వార్నింగ్‌..!

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకేష్‌ వల్ల టీడీపీకే నష్టమని పేర్కొన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని లక్ష్మీపార్వతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'లోకేష్‌ ఎంత ఎక్కువ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అంత భ్రష్టుపడుతుంది. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే లోకేష్‌ను పక్కనపెట్టాలి' అని పేర్కొన్నారు. మహిళలను కించపరిచేలా లోకేష్‌ వ్యాఖ్యలు చేస్తున్నారన్న లక్ష్మీపార్వతి.. ఇటువంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందని హెచ్చరించారు. ఇక.. ఏపీలో ప్రజాపాలన సాగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.