లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే...

 లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే...

ఎన్టీఆర్ బయోపిక్ లో మూడో సినిమాగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మార్చి 29 వ తేదీన రిలీజ్ అయ్యింది.  వివాదాస్పదమైన సబ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టుతున్నది.  యూఎస్ లో మార్చి 28 వ తేదీన 120 లొకేషన్స్ లో రిలీజ్ అయ్యింది.  అక్కడ దాదాపుగా $1,45,928 డాలర్లు వసూలు చేసింది.  వర్మ సినిమాల్లో ఇది బెస్ట్ వసూళ్ళని చెప్పొచ్చు.  

తెలంగాణ, కర్ణాటకలోను ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది.  మొదటిరోజు ఈ సినిమా దాదాపు రూ.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  వరసగా ప్లాప్ లు అందుకుంటున్న వర్మకు ఇది బెస్ట్ వసూళ్లనే చెప్పాలి.  ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా రిలీజ్ కాలేదు.  ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపాలని ఏపీ హైకోర్ట్ తీర్పునిచ్చింది.  దీనిపై వర్మ సుప్రీం కోర్ట్ కు వెళ్లబోతున్నాడు. హైకోర్ట్ తీర్పుకు స్టే తీసుకురాగలిగితే.. ఏపీలోను భారీ వసూళ్లు వస్తాయని అనడంలో సందేహం ఉండదు.