మరో ట్విస్ట్... లక్ష్మీస్ ఎన్టీఆర్ మళ్ళీ వాయిదా

మరో ట్విస్ట్... లక్ష్మీస్ ఎన్టీఆర్ మళ్ళీ వాయిదా

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా మంచి వసూళ్లు కూడా రాబట్టింది.  మార్చి 29 వ తేదీన రిలీజైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది.  

ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సినిమాను రిలీజ్ చేయకూడదని కొంతమంది కోర్టును ఆశ్రయించారు.  దీంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది.  ఎన్నికలు పూర్తయ్యాక సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నారు.  ఈరోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఛాంబర్ లో జడ్జిల కోసం ప్రదర్శించారు.  కాగా, ఈ సినిమా అనంతరం తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.  ఏప్రిల్ 12 వ తేదీన సినిమాను రిలీజ్ చేసుకుందామని అనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీంకు నిరాశే ఎదురైంది.  సినిమా రిలీజ్ కోసం ఏప్రిల్ 19 వ తేదీ వరకు ఆగాల్సిందే.