వర్మ ఫిక్స్ చేశాడు..!!!

వర్మ ఫిక్స్ చేశాడు..!!!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మార్చి 22 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయి.  మరో రెండు మూడు రోజుల్లో సెన్సార్ కు వెళ్ళబోతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు జరగబోతున్న తరుణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఓ సంచలనంగా మారబోతున్నది. 

సినిమా రిలీజ్ డేట్ నే కాకుండా సినిమా రిలీజ్ సమయాన్ని కూడా వర్మ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  మార్చి 22 వ తేదీన 12 గంటలకు సినిమా రిలీజ్ అవుతుందని వర్మ చెప్పారు.  ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు అనే దానికి వర్మ సరైన సమాధానం చెప్పారు.  ఎన్టీఆర్ లక్కీ నెంబర్ కు, మార్చి 22 కు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీకి సంబంధాన్ని చూపిస్తూ చేసిన లెక్క అందరిని ఆకట్టుకుంటోంది.  మరి సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.