లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ - నిజాన్ని ఎవ్వరూ ఆపలేరు..!!!

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ - నిజాన్ని ఎవ్వరూ ఆపలేరు..!!!

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని రెండో ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  ఎన్టీఆర్ పరపతిని ఎలా ఎవరు దెబ్బతీశారు.  ఎందుకు ఆయన పార్టీ నుంచి బయటకు రావలసి వచ్చింది.  పార్టీలో ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి..? లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి ఎందుకు వచ్చింది.. బాబు పార్టీని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు గతంలోనే వర్మ ప్రకటించారు.  

చెప్పినట్టుగానే సినిమా ఉండబోతుందని ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తెలియజేసింది.  ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది.  వర్మ సినిమాలో టేకింగ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. టేకింగ్ తో పాటు ఈ సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి.  నిజాన్ని ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి ముగించిన విధానం ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది.