భారత్ కు స్వర్ణం
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కు స్వర్ణం లభించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో భారత యువ ఆటగాడు లక్ష్య సేన్ 21-19, 21-18 తేడాతో కున్లవుత్ వితిద్సరన్(థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. 46 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో లక్ష్యసేన్ అద్భుతంగా పోరాడి స్వర్ణ పథకం సాధించాడు. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత జట్టు చివరిసారి 1965లో స్వర్ణం గెలిచింది. గౌతమ్ థక్కర్ స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించాడు. అయితే ఓవరాల్‌గా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన ప్లేయర్‌గా లక్ష్య సేన్ మూడవ స్థానంలో ఉన్నాడు. 2012లో పీవీ సింధు స్వర్ణం గెలిచింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)