ఆసుపత్రిలో లాలూ...

ఆసుపత్రిలో లాలూ...

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ప్రస్తుతం బెయిల్‌పై ఇంట్లోనే ఉన్న లాలూకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో.. హుటాహుటిన ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రికి తరలించారు. ఐజీఐఎంఎస్‌కి చెందిన ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో లాలూకు చికిత్స అందిస్తున్నారు. దాణా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకి ఈ నెల 11న రాంచీ హైకోర్టు ఆరువారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం సందర్భంగా.. మూడు రోజుల పెరోల్‌పై బయటికి వచ్చిన లాలూకి వైద్యం కారణంతో తాత్కాలిక బెయిల్ మంజూరైంది.