మాజీ సీఎం మనవరాలితో లాలూ తనయుడి పెళ్లి

మాజీ సీఎం మనవరాలితో లాలూ తనయుడి పెళ్లి
బీహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పెళ్లి నిశ్చయయింది. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రసాద్‌రాయ్‌ మనవరాలు ఐశ్వర్యరాయ్‌తో మే 12వ తేదీన తేజ్‌ పెళ్లి జరగనుంది. ఐశ్వర్యరాయ్‌ తండ్రి చంద్రికా రాయ్‌.. లాలూప్రసాద్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. కాగా.. దాదాపు పది నెలల నుంచి తేజ్‌కు లాలూ సతీమణి రబ్రీదేవి సంబంధాలు చూస్తున్నారు. ఏరికోరి మరీ రాజకీయ కుటుంబానికే చెందిన యువతిని ఎంపిక చేశారు. పాట్నాలోని మౌర్య హోటల్లో తేజ్ ప్రతాజ్, ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్ ఈ నెలాఖరులోగా జరగనుంది. కాగా.. దాణా కుంభకోణం కేసులో భాగంగా లాలూప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.