సంక్షోభంలోనూ సత్తా చాటుతోన్న లంబోర్గిని

సంక్షోభంలోనూ సత్తా చాటుతోన్న లంబోర్గిని


ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని సంక్షోభంలోనూ సత్తా చాటుతోంది. దేశీయ ఆటోమొబైల్ రంగం అమ్మకాలు లేక దివాలా తీసిన పరిస్థితిల్లో కూడా లంబోర్గిని ఉరుస్‌కు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లంబోర్గిని విక్రయాలు 30శాతం పెరగడం విశేషం. దేశీయ మార్కెట్లో ఈ కార్లకు ఫుల్ డిమాండ్ ఉండడంతో భారీగా విక్రయాలు జరుగుతున్నాయి.

3 కోట్ల విలువ చేసే ఈకారు, వారానికొకటి చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. వచ్చే మూడేళ్లలో ఏడాదికి 100 వాహనాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లంబోర్గిని ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ ఏడాదిలో 65 యూనిట్ల లంబోర్గిని కార్లను విక్రయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే భారత్‌ లో ఒక ఏడాదిలో 50 కంటే ఎక్కువ వాహనాలను విక్రయించిన తొలి సూపర్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థగా లంబోర్గిని రికార్డు సృష్టించనుంది. గతేడాది ఈ సంస్థ భారత్‌లో 45 వాహనాలను విక్రయించింది.