ల్యాంకో షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

ల్యాంకో షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

కంపెనీ దివాళాకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్ (ఎన్ సీఎల్ టీ) ఆదేశించడంతో ల్యాంకో ఇన్ ఫ్రాటెక్  షేర్ల ట్రేడింగ్ ను నిలిపివేయాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి ల్యాంకో ఇన్ ఫ్రాలో ట్రేడింగ్ ఆపేస్తున్నట్లు బీఎస్ఈ ప్రకటించింది. 1993లో ఏర్పడిన ల్యాంకో 2006 నవంబర్ 6వ తేదీన పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.  అప్పటి నుంచి అనేక రంగాల్లోకి విస్తరించిన ల్యాంకో ఆరంభంలో ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున లాభాలను తెచ్చి పెట్టింది.  చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో కంపెనీ బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో బ్యాంకులు దివాళా పిటీషన్ చేశాయి.  దివాళాకు ఎన్ సీఎల్ టీ ఆదేశించడంతో కంపెనీ చరమదశకు చేరుకుంది.  ప్రస్తుతం కంపెనీ షేర్లు 40 పైసల వద్ద ట్రేడవుతున్నాయి.