అమరావతిలో జడ్జిలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు

అమరావతిలో జడ్జిలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు

ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, సచివాలయ పరిధిలో పనిచేసే ఐఏఎస్ అధికారులు, హెచ్ఓడీలు, ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం సీఆర్డీయే 238 ఎకరాలు కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. హైకోర్టు జడ్జిలకు చదరపు గజం రూ.5వేల చొప్పున 750 చదరపు గజాలు, ఐఏఎస్ అధికారులకు రూ.5 వేల చొప్పున 500 చ.గ, ఎన్టీవోలకు రూ.4 వేల చొప్పున 175 చ.గ, గెజిటెడ్ అధికారులకు రూ.4500 చొప్పున 200 చ.గ కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.