స్టార్ బౌలర్ క్రికెట్‌కు గుడ్‌బై..!

స్టార్ బౌలర్ క్రికెట్‌కు గుడ్‌బై..!

అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీలంక స్టార్ పేస్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ త్వరలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి వన్డే అనంతరం అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు మలింగ రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని శ్రీలంక కెప్టెన్‌ కరుణరత్నే వెల్లడించారు. ఇక, బంగ్లాదేశ్‌తో  జరనున్న సిరీస్‌కు సోమవారం శ్రీలంక బోర్డు ప్రకటించిన 22 జట్టు సభ్యుల జాబితాలో మలింగకు చోటు దక్కింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ జరగబోతోంది. ఈ సిరీస్‌లో 26న తొలి వన్డే జరగనుండగా.. అనంతరం మలింగ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. ఇక, ఈ నెల 28 రెండో వన్డే, 31న మూడో వన్డే జరగనున్నాయి. కాగా, శ్రీలంక క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంపాటు సేవలించిన మలింగ.. ఇప్పుటి వరకు 219 వన్డేలు ఆడి 335 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌ టోర్నీలోనూ శ్రీలంక జట్టు తరఫున 7 వన్డేల్లో 13 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు మలింగ. 36 ఏళ్ల మలింగ 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టడం విశేషం. మరోవైపు అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్‌ (523), చమిందా వాస్‌ (399) తర్వాత మూడో బౌలర్‌ మలింగయే.