చంద్రబాబుకు, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు

చంద్రబాబుకు, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు

ఏపీలో దురదృష్టవశాత్తు హత్యరాజకీయాలు పెరిగిపోయాయని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగానే వైఎస్ వివేకా హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అనుకోవడం లేదని అన్నారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే కేంద్ర బలగాలు ఏపీకి రావాలని డిమాండ్ చేశారు. ఏదో విధంగా ఈ ఎన్నికలు వాయిదా పడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు గాడి తప్పాయని అన్నారు. వైఎస్ వివేకా హత్యపై ఓ డీజీపీ మాట్లాడాల్సిన విషయాలు చంద్రబాబు మాట్లాడడమేంటి? అన్నారు. రాయలసీమను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో పరిటాల రవి హత్యకు గురైతే సీబీఐ విచారణ కోరారని గుర్తుచేశారు. కానీ ఈ మధ్య జరిగే ఘటనలకు మాత్రం సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. నిజాయితీగా పనిచేసే పోలీసులు కూడా పని చేయలేకపోతున్నారని విమర్శించారు. గవర్నర్‌ను కూడా చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని విష్ణువర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు.