భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి

చిత్రంగా నిన్న పటిష్ఠంగా కన్పించిన మార్కెట్‌ ఇవాళ చాలా బలహీనంగా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు ఆరు శాతం దాకా పడినా... నష్టాలను ఒక శాతం కూడా దాటనీయని నిఫ్టి... ఇవాళ అంతటా ప్రశాంతత ఉన్నా... ఏకంగా వంద పాయింట్లు క్షీణించి... 15,000 దిగువ.. 11,497 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 323 పాయింట్లు తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దాదాపు అన్ని బ్యాంకు షేర్లూ ఇవాళ ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, బలహీన షేర్లు అయిదుశాతం దాకా పడ్డాయి. ఇక మెటల్స్‌ కూడా అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా... యూరో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చిన ఈ ఒత్తిడిపై మార్కెట్‌లో భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల ముందే మార్కెట్‌లో కరెక్షన్‌ రావొచ్చని కొందరు టెక్నికల్‌ అనలిస్టుల అంచనా. నిఫ్టికి అంత్యంత కీలకమైన 15,000 స్థాయికి దిగువకు మార్కెట్‌ రావడంపై అనలిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మన్ముందు భారీ పతనం ఉంటుందని వీరు అంటన్నారు. నిఫ్టి ప్రధాన షేర్లలో హిందుస్థాన్ లీవర్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎల్‌ అండ్‌ టీ, హిందాల్కో, విప్రో టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌... టాటా మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్.... మన్‌ పసంద్‌, స్టార్‌, బజాజ్‌ కార్పొరేషన్‌, బిర్లా కార్పొరేషన్‌, మారికో. సెన్సెక్స్‌ లూజర్స్‌... దీవాన్‌ హౌసింగ్‌, టాటా స్టీల్‌ (పీపీ), డిష్‌ టీవీ, ఆర్‌ పవర్‌, బలరామ్‌పూర్‌ చిని.