అంబులెన్స్ లో వచ్చి మరీ ఓటేశాడు.. 

అంబులెన్స్ లో వచ్చి మరీ ఓటేశాడు.. 

సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌ సాయం‍త్రం 6 గంటలకు ముగియనుంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్ కు చేరుకుంటున్నారు. బీహర్ లో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియచేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే ఆసుపత్రి నుంచి ఏకంగా అంబులెన్స్ లో పోలింగ్ బూత్ కు చేరుకున్నాడు. తన ఓటు హక్కును వినియోగించుకుని స్ట్రేచర్ పైనే తిరిగి అంబులెన్స్ లో వెళ్లిపోయాడు. అతడిని పోలింగ్ అధికారులు, స్ధానికులు అభినందించారు. ఆదివారం జరుగుతున్న చివరి దశ పోలింగ్ లో 918 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఎన్నికల్లో 10.01 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానానికి ఈ విడతలోనే పోలింగ్‌ జరుగుతోంది.