లేటు వయసులో...

లేటు వయసులో...

సోషల్ మీడియా విస్తరించాక ఫోటో, వీడియో, ఆడియో తేడా లేకుండా విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. రెండు రోజులుగా ఫేస్ బుక్ తెరిచినా, వాట్సాప్ చూసినా ఓ బట్టతల అంకుల్ బాలీవుడ్ స్టార్ గోవిందా మాదిరిగా స్టెప్పులేసి తెగ సందడి చేస్తున్నాడు. 1980లలోని ఓ ఎవర్ గ్రీన్ పాటకు ఆయన చేసిన డాన్స్ చూసినవాళ్లంతా ఎవరీ సడన్ స్టారని ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం అంకుల్ ఎనర్జీ లెవెల్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. ఎవరీ డాన్స్ మాస్టర్ అని ఇంటర్నెట్ ను తెగ వెతికేస్తున్నారు.

ఇంతకు గోవిందా తరహాలో డాన్స్ చేసిన ఈయన పేరు సంజీవ్ శ్రీవాస్తవ్. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నివాసం. 46 ఏళ్ల శ్రీవాస్తవ్ బాబా కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. డాన్సంటే అందులోనూ గోవిందా స్టెప్పులంటే ఎంతో ఇష్టపడే సంజీవ్ ఖాళీగా ఉన్నపుడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. మే 12న బిదిషాలోని ఓ పెళ్లిలో తన అర్ధాంగి అంజలితో కలిసి సంజీవ్ శ్రీవాస్తవ్ 1987లో విడుదలైన ఖుద్‌గర్జ్‌ చిత్రంలోని ‘ఆప్‌ కే ఆ జానే సే..’  పాటకు డాన్స్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా  శ్రీవాస్తవ్ డ్యాన్స్‌కు ముగ్దుడై మధ్యప్రదేశ్ నీళ్లలోనే ఓ విశేషం ఉందంటూ ట్వీట్ చేశారు. ఇక ఫిల్మ్ స్టార్స్ అనుష్కా శర్మ, రవీనా టండన్, దివ్యా దత్తా కూడా ట్వీట్ చేశారు. 

ఆరు పదుల వయసు.. పేషెంట్లు, సర్జరీలతో క్షణం తీరిక లేని జీవితం.. అయినా సన్ షైన్ హాస్పిటల్స్ అధిపతి, ఆసియాలోనే ప్రముఖ చీఫ్ జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డాక్టర్ ఏవీ గురవారెడ్డి డాన్స్ చేసే అవకాశం వస్తే అసలు వదిలిపెట్టరు. కూతురి పెళ్లిలో ఆయన వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి. ఇక గబ్బర్ సింగ్ సినిమాలో పిల్లా నువ్వులేని జీవితం.. నల్లరంగు అంటుకున్న తెల్ల కాగితం పాటకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవ్ మెంట్స్ ని రియల్ లైఫ్ లో డాక్టర్ గురవారెడ్డి తన భార్య భవానీతో కలిసి వేశారు. కొండలు, కోనలు, సెలయేళ్ల దగ్గర పవన్ స్టైల్లో డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు డాక్టర్ గురవారెడ్డి. ఆయన చేసిన డాన్స్ యూట్యూబ్ లో ఎంతో పాపులరైంది. లైఫ్ ఎంజాయ్ చేయడానికి వయసు అడ్డుకాదని నిరూపించారు డాక్టర్.  

వీడియోను ఈ లింక్ ద్వారా చూడగలరు.