'గుర్దాస్ పూర్ టికెట్ సన్నీ డియోల్ కి ఇచ్చినందుకు బాధ కలిగింది'

'గుర్దాస్ పూర్ టికెట్ సన్నీ డియోల్ కి ఇచ్చినందుకు బాధ కలిగింది'

పంజాబ్ లోని గుర్దాస్ పూర్ టికెట్ ఇవ్వనందుకు నిరాశ చెందిన దివంగత ఎంపీ, నటుడు వినోద్ ఖన్నా భార్య కవితా ఖన్నా బాధ వ్యక్తం చేశారు. ఇది పార్టీ నిర్ణయం అని కవిత అన్నారు. కానీ ఈ నిర్ణయం తీసుకున్న తీరు తనకు బాగా బాధ కలిగించిందని చెప్పారు. తను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉటానని, నరేంద్ర మోడీని తప్పకుండా సమర్థిస్తానని ఆమె స్పష్టం చేశారు.

టికెట్ లభించినందుకు నిరాశ చెందిన కవితా ఖన్నా ' నాకు చాలా దుఃఖం కలిగింది. కానీ టికెట్ల కేటాయింపు అనేది పార్టీ నిర్ణయం మేరకు జరుగుతుందని నేను అర్థం చేసుకోగలను. అయితే అలా చేసేటపుడు ఒక పద్ధతి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే జరిగిందో దాంతో నాకు చాలా దుఃఖం వచ్చింది. నన్ను ఒంటరిగా వదిలేసినట్టు, తిరస్కరించినట్టు అనిపించింది. నేను అనవసరం అని చెప్పకుండానే చెప్పిన భావన కలిగింది' అని చెప్పారు.

తన ఆగ్రహాన్ని ఎప్పుడు ఎక్కడా ప్రదర్శించబోనని కవితా ఖన్నా తెలిపారు. 'దీనిపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యానాలు చేయరాదని నాకు నేను నిర్ణయించుకున్నాను. నా వ్యక్తిగతాన్ని త్యాగం చేసి పూర్తి శక్తిసామర్థ్యాలతో ప్రధానమంత్రి మోడీని బలపరుస్తాను' అన్నారు. 2014లో గుర్దాస్ పూర్ నుంచి వినోద్ ఖన్నా బీజేపీ టికెట్ తో ఎన్నికల్లో గెలిచారు. కానీ ఆయన హఠాన్మరణంతో ఆ సీటు ఖాళీ అయింది.

2019 ఎన్నికల్లో గుర్దాస్ పూర్ నుంచి బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ని బీజేపీ పోటీకి నిలిపింది. అంతకు కొద్ది రోజుల ముందే సన్నీ పార్టీలో చేరారు. వెంటనే పార్టీ ఆయనను గుర్దాస్ పూర్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అంతకు ముందు సన్నీ తండ్రి ధర్మేంద్ర కూడా బీజేపీ టికెట్ పై ఎన్నికల్లో విజయం సాధించారు. ధర్మేంద్ర భార్య, సన్నీ సవతి తల్లి హేమా మాలిని కూడా బీజేపీ టికెట్ పై మథుర నుంచి పోటీ చేస్తున్నారు.