"ఆర్‌ఆర్‌ఆర్‌” సాలిడ్ టీజర్ పై మరో అప్డేట్‌..!

"ఆర్‌ఆర్‌ఆర్‌” సాలిడ్ టీజర్ పై మరో అప్డేట్‌..!

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. వీరిద్దరి వేర్వేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు. అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే... ఈ సినిమా తాలుకా టీజర్‌ను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్‌ రిలీజ్‌ చేయనున్నారని అనే వార్త బాగానే వైరల్‌ అయింది. ఇక దీనిపై మరో వార్త వైరల్‌ అవుతోంది. ఈ సాలిడ్‌ టీజర్‌కు గాను మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించనున్నట్టుగా లెటెస్ట్‌ టాక్‌.  ఈ మధ్య ఈ సినిమాకి ఆయా ఇండస్ట్రీల నుంచి పలువురు స్టార్‌ హీరోలు తమ గాత్రాన్ని ఇస్తున్నారని టాక్‌ వచ్చి  సంగతి కూడా తెలిసిందే.. మరి అలానే ఇప్పుడు ఈ టీజర్‌కు మెగాస్టార్‌ చిరు స్టార్ట్‌ చేయనున్నారని టాక్‌ నడుస్తోంది. అయితే... దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది.