చరణ్ ఫస్ట్ లుక్ డేట్ అదేనా ?

చరణ్ ఫస్ట్ లుక్ డేట్ అదేనా ?

'రంగస్థలం' లాంటి భారీ విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  మొదటిసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఔట్ ఫుట్ ఎలా ఉంటుందోనని, అసలు ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలని  అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ త్వరలో ఫస్ట్ ఎప్పుడో చెప్తామని ప్రకటన చేసింది.  తాజా సమాచారం మేరకు ఫస్ట్ లుక్ 7వ తేదీన విడుదలవుతుందని అంటున్నారు.  ఈ మేరకు ఈరోజే అధికారిక ప్రకటన వెలువడే సూచనలున్నాయి.