మహేష్ సినిమాపై కొత్త రూమర్ !

మహేష్ సినిమాపై కొత్త రూమర్ !

 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'మహర్షి' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.  ముందుగా చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదలచేయాలని అనుకున్నారు.  కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టే సూచనలు కనిపిస్తుండటంతో తేదీని వెనక్కి జరిపే యోచనలో ఉన్నారట టీమ్.  అంటే ఏప్రిల్ నెలాఖరున కాకుండా జూన్ నెలలో విడుదలచేయాలని అనుకుంటున్నారట.  అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు.  పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజి, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇందులో కూడా 'శ్రీమంతుడు, భరత్ అనే నేను' తరహాలోనే ఓక్ సామాజిక అంశం హైలెట్ కానుంది.