తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం..బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక.!

తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం..బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక.!

తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. చింతూరు లోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ‌ మునిగినట్టు తెలుస్తోంది. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం. చీకటి కావటంతో ఎంత మంది లాంచీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందటంతో ఘటనా ప్రాంతానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు చేరుకున్నట్టు తెలుస్తోంది. లాంచిలో ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వరద బాధితులకు ముగ్గురు వ్యక్తులు లాంచీలో నిత్యవసర వస్తువులు పంచి వస్తుండగా చింతూరు బ్రిడ్జి వద్ద లాంచీ బ్రిడ్జిని ఢీ కొని మునిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.