లావణ్య హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

లావణ్య హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

హైదరాబాద్ లో కలకలం రేపిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య హత్య కేసు మిస్టరీని ఆర్ సీ పురం పోలీసులు ఛేదించారు. లావణ్యను ఆమె ప్రియుడు సునీల్ కుమార్ హత్య చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్రనగర్ కు చెందిన సునీల్ కుమార్, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని లావణ్య ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. లావణ్య తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో వదిలించుకునేందుకు ప్లాన్ వేశాడు. రెండు రోజుల క్రితం మాట్లాడుకుందామని చెప్పి సునీల్ లాడ్జ్ కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన లావణ్యను అతికిరాతకంగా చంపేశాడు. మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్ లో పెట్టి సురారంలోని కాలువలో పడేశారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన లావణ్య తిరిగి రావకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఆర్ సీ పురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ప్రియుడు సునీల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.