నిఖిల్ సినిమాలో అందాల రాక్షసి

నిఖిల్ సినిమాలో అందాల రాక్షసి

'కిర్రాక్ పార్టీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత, నిఖిల్ హీరోగా టీ.యన్.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముప్పై శాతం పూర్తి చేసుకుంది. ‘విక్రమ్ వేద’ ఫేమ్ శ్యాం సి.ఎస్. సంగీతం సమకూరుస్తుండగా సూర్యా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

 ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ ల పై  కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్నారు.

నటీనటులు:

నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు

సాంకేతిక నిపుణులు: 

పి.ఆర్.ఓ : వంశి - శేఖర్ 

కాస్ట్యూమ్ డిజైనర్ : రాగా రెడ్డి

ఫైట్స్: వెంకట్డి

ఆర్ట్ డైరెక్టర్ : సాయి సురేష్

సంగీతం: శ్యాం సి ఎస్

ఛాయాగ్రహకుడు: సూర్యా

నిర్మాత: కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్

సమర్పణ: ఠాగూర్ మధు 

బ్యానర్: ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి

కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: టీ.యన్.సంతోష్