లక్ష్మి.. గణేశ్.. తాజాగా మోడీ

లక్ష్మి.. గణేశ్.. తాజాగా మోడీ

Image: ANI

దీపావళి ముందు వచ్చే ధన త్రయోదశి సందర్భంగా చాలా మంది హిందువులు బంగారం కొంటారు. అది వారికి ఓ సెంటిమెంట్. అటు బంగారం విక్రయదారులు కూడా సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. మోడీ ప్రధాని అయ్యాక దేశానికి చాలా మేలు జరిగిందని భావించిన సూరత్ లోని ఓ జువెల్లర్.. గోల్డ్ కడ్డీల మీద మోడీ చిత్రాన్ని ముద్రించి అమ్ముతున్నాడు. గోల్డ్ బార్స్ మీద లక్ష్మి, గణేశ్, సరస్వతి, బాలాజీ వంటి దేవీ-దేవతల చిత్రపటాలు  ఎంబోజ్ చేయడం సాధారణమే. 

మోడీ చిత్రపటం వేయడంతో అటు కస్టమర్లు కూడా ఈ కొత్త ప్రయోగానికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారని షాప్ ఓనర్ మిలన్ అంటున్నాడు. గోల్డ్ మీదనే కాదు.. సిల్వర్ బార్స్ మీద కూడా మోడీ చిత్రపటాన్ని ఎంబోజ్ చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. ఓ కస్టమరైతే.. ఈసారి మోడీ చిత్రపటంతోనే ధనలక్ష్మి పూజ చేస్తానని చెబుతోంది. రాఖీల మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి కస్టమర్లను ఆకర్షించడం మామూలే.