స్టోర్ రూంను తలపిస్తున్న క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్

స్టోర్ రూంను తలపిస్తున్న క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్

లాహోర్ లోని లాహోర్ సిటీ క్రికెట్ అసోసియేషన్ డ్రెస్సింగ్ రూమ్ అచ్చం స్టోర్ రూంను తలపిస్తుంది. ఎస్ఎన్జీపీఎల్ మరియు లాహోర్ వైట్ మధ్య జరిగే మ్యాచ్ ఆటగాళ్లు ఈ డ్రెస్సింగ్ రూమ్ ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే.. పాకిస్థాన్ జట్టులో ఆడే ఆరుగురు టెస్ట్ ప్లేయర్లు కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నారు. వారు కూడా ఈ డ్రెస్సింగ్ రూమ్ నే ఉపయోగిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియోను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. నెటిజన్లు పాక్ బోర్డుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

'ఇది స్టోర్ రూమ్ కాదు. ఇది ప్రస్తుతం ఎస్ఎన్జీపీఎల్ మరియు లాహోర్ వైట్ మధ్య జరిగే మ్యాచ్ ఆటగాళ్ల యొక్క డ్రెస్సింగ్ రూం. ఆరుగురు టెస్ట్ ప్లేయర్లు కూడా ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు. నేను ఆటగాళ్ళకు మరింత మెరుగైన సౌకర్యాలు అవసరం అని భావిస్తున్నాను. డ్రెస్సింగ్ రూంతో సహా అవుట్ ఫీల్డ్, పిచ్ లు క్రికెట్ కు సహరించట్లేదు' అని మిస్బా ఉల్ హాక్ ట్విట్టర్ లో తెలిపారు.