కాంగ్రెస్ కు జై కొట్టిన లెఫ్ట్ పార్టీ... 

కాంగ్రెస్ కు జై కొట్టిన లెఫ్ట్ పార్టీ... 

ఈ ఏడాది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి తిరిగి అధికారంలోకి రావాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్న‌ది.  బెంగాల్ కోట‌లో పాగా వేయ‌డానికి బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతున్న‌ది.  అయితే, 15 ఏళ్ల క్రితం వ‌ర‌కూ బెంగాల్ రాష్ట్రాన్ని ప‌రిపాలించిన లెప్ట్ పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌టంతో మ‌మ‌త అధికారంలోకి వ‌చ్చింది.  ఈసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎలాగైనా తిరిగి బ‌లం పుంజుకోవాల‌ని లెప్ట్ పార్టీ చూస్తున్న‌ది.  ఇందులో భాగంగానే పొత్తుల‌కు సిద్దం అవుతున్న‌ది లెప్ట్.  కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్దంగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే లెప్ట్ ప్ర‌క‌టించింది.  2016 ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు క‌లిసి పోటీ చేశాయి.  ఎక్కువ స్థానాల్లో లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తే, త‌క్కువ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది.  ఆ ఎన్నిక‌ల్లో లెఫ్ట్ 40 చోట్ల విజ‌యం సాధిస్తే, కాంగ్రెస్ 44 చోట్ల విజ‌యం సాధించింది.  2021లోకూడా రెండు పార్టీలు క‌లిసి బ‌రిలోకి దిగితే బాగుంటుంద‌నే అలోచ‌న‌తోనూ, తృణ‌మూల్ గూండా రాజ‌కీయాన్ని, బీజేపీ మ‌త‌త‌త్వ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేయ‌బోతున్న‌ట్టు లెఫ్ట్ ఫ్రంట్ చైర్‌పర్స‌న్ బిమ‌న్ బోస్ పేర్కొన్నారు.