లెజెండ్ ఈజ్ బ్యాక్ !

 లెజెండ్ ఈజ్ బ్యాక్ !

ఒకప్పటి స్టార్ డైరెక్టర్లలో మణిరత్నం కూడ ఒకరు.  ఆయన తీసిన 'రోజా, బొంబాయి, నాయకుడు' వంటి సినిమాలు ఇప్పటికీ ఆణిముత్యాలే.  అందుకే ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది.  ఈ మధ్య ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలతో నిలుస్తూ వచ్చాయి. 

కానీ తాజాగా ఆయన రూపొందించిన 'నవాబ్' మాత్రం హిట్ దిశగా వెళుతోంది.  మొదటి రోజు సినిరంకు మంచి టాక్ వచ్చినా అందరూ ఫస్ట్ డే ఏ పెద్ద సినిమాకైనా ఇదే టాక్ ఉంటుంది అనుకున్నారు.  కానీ శుక్ర, శనివారాల్లో సినిమా మంచి వసూళ్లను సాధించి ఇంకాస్త మెరుగైన టాక్ తెచ్చుకోవడంతో విజయం ఖరారైంది.  ఓవర్సీస్లో ప్రేక్షకులు సైతం సినిమా హిట్ కావడంతో లెజెండ్ ఈజ్ బ్యాక్ అంటున్నారంతా.