ఫార్మా సిటీలో చిరుత.. జాగ్రత్త..

ఫార్మా సిటీలో చిరుత.. జాగ్రత్త..

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ఫార్మా సిటీ ప్రాంతంలో చిరుత వణుకుపుట్టిస్తోంది... గత కొన్ని నెలలుగా అదునుచూసి మేకలు, ఆవులను, దూడలను చంపేస్తున్న చిరుత... నాలుగు రోజులుగా మరింత రెచ్చిపోయింది. వరుసగా నాలుగు రోజులు.. నాలుగు ఆవులను చంపేసింది. దీంతో ఫార్మా సిటీ అనుకొని ఉన్న దాదాపు 20 గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక, అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు... గ్రామాల్లో డప్పు చాటింపు వేసి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు ఫార్మా సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు చిరుత కదలికలపై నిఘా పెట్టేందుకు అక్కడక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు కందుకూరు ఎఫ్‌ఆర్‌వో.