మరో చిరుత బలి..

మరో చిరుత బలి..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మరో చిరుత బలైంది... ఈ సారి వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుత పులి మృతిచెందింది... ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది... దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లాలో మృతిచెందిన చిరుతల సంఖ్య రెండుకు చేరింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రంగంపేటలో జంతువుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఉచ్చు ఏర్పాటు చేశారు. అది మెడకు గట్టిగా బిగుసుకుపోవడంతో చిరుత గిలగిలా కొట్టుకుని మృతిచెందింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు... వేట గాళ్ల కోసం ఆరా తీస్తున్నారు.