ప్రగతి నివేదన సభతో బస్సుల కొరత

ప్రగతి నివేదన సభతో బస్సుల కొరత

ప్రగతి నివేదన సభతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలలోని సుమారు 70 శాతం బస్సులు సభకు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే.. వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రైవేట్ వాహనాలలో ఈ రోజు రెండింతల ఛార్జ్ వసూల్ చేస్తున్నారు. జనగాం నుండి ఉప్పల్ వరకు సాధారణంగా ప్రైవేట్ వాహనాల వారు 80 రూపాయలు తీసుకునేవారు. ఈ రోజు అయితే ఏకంగా 150 రూపాయలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగితా చోట్లలలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. దీంతో ప్రయాణికులు అధిక ధరలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.