ఎల్‌జీ వీ50 థిన్‌క్యూ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల

ఎల్‌జీ వీ50 థిన్‌క్యూ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల

సౌత్ కొరియా ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు 'ఎల్‌జీ' త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'ఎల్‌జీ వీ50 థిన్‌క్యూ' 5జీని విడుదల చేసింది. ఈ నూత‌న స్మార్ట్‌ఫోన్ లో 5జీని అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఎల్‌జీ సంస్థ ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఈ ఫోన్ ఒక బ్లాక్ కలర్ లో మాత్రమే లభించనుంది. డ్యూయల్ స్క్రీన్, వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ ఫోన్ లో పలు ఆకట్టుకునే ఫీచ‌ర్లు ఉన్నాయి. సౌత్ కొరియా, ఆస్ట్రేలియాలలో ఈ ఫోన్ లభించనుంది.

ఫీచ‌ర్లు:

# 6.4 ఇంచ్ ఫుల్ విజన్ ఓలెడ్ డిస్‌ప్లే
# డ్యూయల్ స్క్రీన్
# 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
# ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌
# ఆండ్రాయిడ్ 9.0 పై
# 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ (2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌)
# 16, 12, 12 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
# 8, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు
# ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
# 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ