ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రమాదం, ముగ్గురు మృతి

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రమాదం, ముగ్గురు మృతి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది.. తుళ్లూరు మండలం రాయపూడిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాల దగ్గర లిఫ్టులో ప్రమాదం జరిగింది. భవనం ఐదో అంతస్తులో పనిచేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా... ఈ ప్రమాదంలో ముగ్గురు సాంకేతిక నిపుణులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా బీహార్ వాసులుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.