చల్లని కబురు: తెలంగాణకు వర్ష సూచన

చల్లని కబురు: తెలంగాణకు వర్ష సూచన

నిప్పులకుంపటిలా మారిన తెలంగాణ చల్లబడనుంది. ఎండప్రచండంతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త. రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ ఈదురుగాలులతో ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అకాశాలున్నాయని.. వర్షాలు లేని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించారు.